The Desk…Eluru : ప్రజల ఆనందమే నిజమైన ఆత్మసంతృప్తి           ➖ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

The Desk…Eluru : ప్రజల ఆనందమే నిజమైన ఆత్మసంతృప్తి ➖ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజల ఆనందమే తనకు నిజమైన ఆత్మసంతృప్తిని కలిగిస్తుందనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. అదేలక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ..రోడ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఏలూరు 13, 6 డివిజన్‌లలో 15వ ఆర్ధిక సంఘం నిధులతో నిర్మిస్తున్న నూతన రహదారుల నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్నిప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తవగా…మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ… తమకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ పాలనలో రహదారులు అస్తవ్యస్తంగా, గుంతల మయంగా మారిపోయాయనీ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇదేక్రమంలో భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను కచ్చితంగా ఆదేశించానని చెప్పారు.

కార్యక్రమంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, కో – ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, నాయకులు ఇసుకపల్లి తాతారావు, డివిజన్ ఇన్చార్జులు పూజారి నిరంజన్, మెరుగుమాల శ్రీనివాసరావు, కో ఇన్చార్జిలు ఎండి దావూద్, మాకాల రమేష్, డివిజన్ల నాయకులు ఉడి రాజశేఖర్, కటికతల యేసు, వంగలపూడి ప్రసాద్, సుంకర మురళి, నేరూసు రాము, జనసేన రాజు, చోటే, పెంటకోట రమేష్, డాక్టర్ వాసు, ఈశ్వర్, దుర్గా మణికంఠ, ఎండి కాజా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు…