The Desk… Eluru: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలు  వెలకట్టలేనివి : చోడగిరి శ్రీనివాస్

The Desk… Eluru: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి : చోడగిరి శ్రీనివాస్

ఏలూరు జిల్లా ఏలూరు : THE DESK : ఏలూరు DMHO ఆఫీస్ మీటింగ్ హాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న లాబ్ టెక్నీషియన్స్ సమీక్షా సమావేశంలో గురువారం చోడగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. లాబ్ టెక్నీషియన్స్ కరోనా సమయంలో.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని.. వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడారు.. భవిష్యత్తు లో లాబ్ టెక్నిషన్స్ సమస్యలు ను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు..డాక్టర్ .శర్మిష్ఠ DMHO ఏలూరు జిల్లా కు వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.. కార్యదర్శి రామారావు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని DMHO ని కోరారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా DMHO డాక్టర్ శర్మిష్ఠ,, DMO ప్రసాద్..ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ కార్యదర్శి నెరుసు రామారావు.. ఉపాధ్యక్షుడు Rvvsn మూర్తి,, రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రత్నాకర్.. కార్యదర్శి కిషోర్..మరియు లాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు..