🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏలూరు శాంతినగర్ లో ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో గురుపూజ మహోత్సవం వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఎంపీ సందేశం ఇస్తూ.. తల్లి తండ్రి తర్వాత గురువే ప్రతి విద్యార్థికి ముఖ్యమని, నిస్వార్ధంగా పనిచేస్తూ విద్యార్థులకు జ్ఞానాన్ని నేర్పుతూ, వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత అని అన్నారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమకు సత్కారం ఏర్పాటు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తూ పనిచేస్తున్న పుట్టా మహేష్ కుమార్ వంటి నేత తమ ఏలూరు పార్లమెంటుకు ఎంపీగా ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థీ విద్యార్థినులకు స్వీట్లు పంపిణీ చేశారు.