The Desk…Eluru : సీఎం చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : సీఎం చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴‎ ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :‎

తెలుగు జాతి చరిత్రను మలుపుతిప్పిన రోజు, చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.ఎన్నో విమర్శలు, సందేహాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒకపక్క పార్టీని, మరో పక్క ప్రభుత్వాన్ని చాకచక్యంగా నడుపుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వమే దిక్సూచి అనే విధంగా తెలుగువారి మనసుల్లో ముద్ర వేయించుకుని, తెలుగుదేశం పార్టీని మూడు సార్లు ఒంటి చేత్తో గెలిపించటం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం అన్నారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ, దేశం కంటే ముందు ఆలోచించే తన విజన్ తో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకుంటూ దూసుకెళుతున్న ఆయనకు మనందరం అండగా నిలబడితే చాలునని, ఆయన ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తారనీ, అటువంటి నేత దొరకడం మనందరి అదృష్టం అన్నారు.

తనలాంటి ఎందరో యువనేతలకు స్ఫూర్తినిచ్చే ఆ మహా నాయకుడు, లెజండరీ లీడర్ మరిన్ని సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలపాలని కోరుకుంటున్నానని చెబుతూ, శుభాకాంక్షలు తెలియచేసారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.‎