The Desk…Eluru : ‎భారీవర్షాలు, గోదావరినది వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ‎భారీవర్షాలు, గోదావరినది వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

  • – అధికారులు, ప్రజలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన
  • – జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్
  • – అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని
  • – గత అనుభవాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :‎

అల్పపీడనం – వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పునరావాసం, రక్షణ చర్యలు చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.‎‎ గోదావరి పరివాహక మండలాల్లోని గ్రామాలలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలు నది తీరాలకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ, గత అనుభవాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను కోరారు.‎కుక్కునూరు, వేలేరుపాడు సహా ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత మండలాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

ఏలూరు పట్టణంతో పాటు జిల్లా అంతటా ఎక్కడా డెంగ్యూ, మలేరియా, జ్వరాలు ప్రబలకుండా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన మందులు ప్రజలకు అందించాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆదేశించారు. ప్రజలకు ‎శుద్ధి చేసిన తాగునీరు, పాలు, పాల పొడి, అత్యవసర మైన మందులు, ఆహార సరఫరా తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీ సూచించారు.

జలవనరులు, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ మరియు వైద్య శాఖలతో సమన్వయం చేస్తూ అత్యవసర సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ‎‎ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని, తమ సమస్యలను వెంటనే తెలియజేయాలని, వరద ఉధృతి పూర్తిగా తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజలకు సూచించారు.‎‎

అత్యవసరం అయితే ఏలూరు కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 1800-233-1077, 94910 41419 ఫోన్ నెంబర్ల లేదా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ నంబర్స్ +91 96181 94377, +91 98855 19299 కు ఎవరైనా కాల్ చేయవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.‎