🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
భారతీయ సినిమా రంగంలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గోల్డ్ ఎడిషన్ లో చోటు దక్కడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందనలు తెలిపారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవం పొందిన తొలి నటుడుగా బాలకృష్ణ నిలవటం తెలుగు వారందరికీ గర్వకారణం అన్నారు.తన తండ్రి ఎన్టీఆర్ పేరు, ప్రతిష్టలను నిలబెడుతూ, సినీ రంగంతో పాటు రాజకీయ, సేవా రంగాల్లో కూడా ఎదురులేకుండా దూసుకుపోతున్న బాలకృష్ణని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
1975లో వచ్చిన ‘ అన్నదమ్ముల అనుబంధం’ చిత్రం నుంచి ఇటీవలే వచ్చిన డాకూ మహారాజ్ వరకూ హీరోగా 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలలో నటించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానని ఏలారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.