The Desk…Eluru : అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండండి – ఎంపీ పుట్టా మహేష్ సూచన

The Desk…Eluru : అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండండి – ఎంపీ పుట్టా మహేష్ సూచన

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

అల్పపీడనం – వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సూచించారు.భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో, ఏలూరు జిల్లాకు కూడా అల్పపీడన ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తో ఢిల్లీ నుండి ఫోన్ లో మాట్లాడారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గండ్లు పడే ప్రమాదం ఉన్నచోట్ల గట్లు పటిష్ట పర్చాలనీ, రెవెన్యూ , పోలీసు, విద్యుత్తు , విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ పుట్టా మహేష్ కోరారు.

అదే సమయంలో వర్షాల కారణంగా జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.అత్యవసర సమయంలో ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంను సంప్రదించాలని సూచించారు. ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయం ఫోన్ నంబర్స్: +91 96181 94377, +91 98855 19299.