ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : విపత్కర పరిస్ధితుల్లో వరద బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ సేకరించిన 1,00,116 రూపాయల చెక్కును మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారికి అసోసియేషన్ నాయకులు అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ… విపత్కర పరిస్ధితుల్లో బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల సహకారం అభినందనీయమన్నారు. ఈ విషయంలో ఉద్యోగుల స్పందన స్పూర్తిదాయకమని ఇదే స్పూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని ఆకాంక్షించారు.
అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక ప్రక్క జిల్లాలో భారీవర్షాల నేపద్యంలో చాక చక్యంగా బాధితులను ఆదుకోవడం, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోప్రక్క విజయవాడ నగరంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను, వాటర్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వోత్తులు,తదితరాలను గత రెండు రోజులుగా జిల్లానుంచి పంపడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఎపి ఎన్ జివోస్ అసోషియేషన్ కార్యదర్శి నెరుసు రామారావు, జె ఏ సి రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ హరనాధ్, ఏలూరు తాలూకా ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు కప్పల సత్యనారాయణ, ఎండి బేగ్, పూడి శ్రీనివాస్, కె. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.