- యం.యస్.యం.ఇ యూనిట్ల ఏర్పాట్ల లక్ష్యాలను సాధించాలి
- భూ సేకరణ చెయ్యవలసిన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి లక్ష్యాలు సాధించాలి
వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి మంగళవారం పోలవరం ఆర్ & ఆర్, యంయస్.యం.ఇ, జాతీయ రహదారులు భూ సేకరణ, 4 జి మొబైల్ టవర్ ఎయిర్టెల్, జియో, బియస్ యన్ యల్ టవర్సు పర్మిషన్లు, తదితర అంశాలుపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూములు అందించిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మాణాలు, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా.. ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలు 800 ఎకరాలను గుర్తించడం జరిగిందన్నారు.
మిగతా 4,200 ఎకరాలకు మండలాలు వారీగా భూ సేకరణపై సమీక్షించగా మరో 600 ఎకరాలు గుర్తించడం జరిగిందన్నారు. భూసేకరణ పనులను ఆగస్టు15 వ తేదీ నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భూములు గుర్తించిన తర్వాత ఆయా రైతులతో ఆర్డీవో, డిఎస్పి అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
భూ సేకరణ స్నేహపూరిత వాతావరణంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం మనస్సు పెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. యంయస్ యంఇ యూనిట్ల ఏర్పాట్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు భూ సేకరణ వేగవంతం చేసి నిర్మాణ పనులకు భూములు అప్పజెప్పాలని అన్నారు.
4జి మొబైల్ టవర్ ఎయిర్టెల్, జియో, బియస్ యన్ యల్ లకు జన ఆవాసాలకు దూరంగా, చుట్టుప్రక్కల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలించి టవర్సు ఏర్పాట్లకు అనుమతులు మంజూరు చెయ్యాలని అన్నారు. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.
జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, అల్లూరి సీతారామరాజు ఐటిడిఏ పివో అపూర్వ భరత్, బచ్చు స్మరణ్ రాజ్,యం.వి.రమణ, యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ కలెక్టరు యస్.సరళ వందనం వారి వారి కార్యాలయం ఛాంబర్లు నుండి, జిల్లా కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, సంబంధిత అధికారులు, ఆయా మండలాలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.