The Desk…Eluru : పీఎం శ్రీ పథకం కింద ఏలూరు, కోనసీమ జిల్లాల్లో 67 పాఠశాలల ఎంపిక ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : పీఎం శ్రీ పథకం కింద ఏలూరు, కోనసీమ జిల్లాల్లో 67 పాఠశాలల ఎంపిక ఎంపీ పుట్టా మహేష్

🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

పీఎం శ్రీ పథకం కింద ఏపీలో 935 పాఠశాలలు ఎంపిక చేయగా, ఏలూరు జిల్లాలో 37, కోనసీమ జిల్లాలో 28 పాఠశాలలు ఎంపికైనట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు.

ప్రధాన మంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం అమలుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పీఎం శ్రీ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి 2022 సెప్టెంబర్ 7న ఆమోదించిందని, ఈ పథకం అమలు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రూ.354.85 కోట్లకు ఆమోదం లభించిందని, ఏడాది ఏలూరు జిల్లాకు రూ.34.65 కోట్లు మంజూరు చేయగా, రూ.6.90 కోట్లు విడుదల కాగా, రూ.5.85 కోట్లు వినియోగించారని, కోనసీమ జిల్లాకు రూ.26.09 కోట్లు మంజూరు కాగా, రూ.5.43 కోట్లు విడుదల చేయగా, రూ.5.27 కోట్లు వినియోగించారని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

పీఎం శ్రీ పథకం కింద 14,500 కంటే ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఏడు దశల్లో మొత్తం 13,076 పాఠశాలలను ఎంపిక చేయగా, వాటిలో 935 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైనట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఉపాధ్యాయుల నియామకం, పదవీవిరమణ, ఖాళీల భర్తీ తదితర అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయని, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని అన్ని పిఎం శ్రీ పాఠశాలల్లో పోస్టుల భర్తీ పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి నివేదికను చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.