The Desk…Eluru : అన్నదాతల కుటుంబాల్లో ఆనందం.. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : అన్నదాతల కుటుంబాల్లో ఆనందం.. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

అన్నదాతల కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని, దీనికి “అన్నదాత సుఖీభవ” పథకం అమలు చేయడమే నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు “అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకం” కింద ప్రతి ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు.

గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే అదనంగా రూ.6,500 లబ్ధి రైతులకు చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు.రాష్ట్రంలోని రూ.48.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,174.43 కోట్లు జమ చేయగా, ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,60,968 మంది రైతులకు రూ.107.08 కోట్ల లబ్ధిచేకూరుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000… కేంద్రం వాటా రూ.2,000 చొప్పున ఈరోజు మొదటి విడతగా 7 వేలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు అమలు చేయడమే కాకుండా, బడ్జెట్ లోనూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచారని ఎంపీ స్పష్టం చేశారు.