The Desk…Eluru : స్ధానిక సమస్యలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దృష్టి

The Desk…Eluru : స్ధానిక సమస్యలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దృష్టి

  • ప్రజాసమస్యలే పరిష్కార ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి..

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాంతాల్లో స్దానిక సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అడిగితెలుసుకున్నారు.

శుక్రవారం ఆర్.ఆర్. పేట, గుబ్బలవారివీధుల్లో పర్యటించిన కలెక్టర్ ప్రజలతో నేరుగా మాట్లాడి మంచినీటి సదుపాయం, డ్రైయిన్ల నిర్వహణ, కార్పోరేషన్ నుంచి రోజు చెత్త తీసుకువెళ్లుతున్నారా లేదా తదితర అంశాలను అడిగితెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.

కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, తహశీల్దారు గాయిత్రీ, స్ధానిక ప్రజా ప్రతినిధులు నాయుడు సోము, ఈతకోట శ్రీనివాసరావు, ఎస్. దుర్గాప్రసాద్, తదితరులు ఉన్నారు.