ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఎన్టీఆర్ జిల్లాకు ఏలూరు జిల్లా అధికారులు శాఖాపరమైన సాయం అందిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాలతో ఏలూరు జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లాకు 22 బోట్లను పంపించడం జరిగిందని జిల్లా మత్స్య శాఖాధికారి నాగలింగాచారి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కలిదిండి నుండి 15, కైకలూరు నుండి 5, పట్టిసీమ ఫెర్రీ నుండి 2 పడవలు ఎన్టీఆర్ జిల్లాకు పంపడం జరిగిందన్నారు. వీటిలో 20 దేశీయ పడవలు, 2 ఫైబర్ బొట్లు ఉన్నాయని నాగలింగాచారి చెప్పారు.