🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

బలమైన నాయకత్వంతో కూటమి త్రయం, అద్వితీయ విజయాలతో ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కూటమి గెలుపునకు అహర్నిశలు శ్రమించిన ప్రతిఒక్క నాయకునికి సమయానుకూలంగా న్యాయం చేస్తామనీ, సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా టిడిపి నాయకులు అమరావతి అశోక్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా గురువారం ఏలూరులోని ఫంక్షన్ హాల్లో ఆయన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఛైర్మన్‌గా అమరావతి అశోక్‌తో పాటూ పర్సన్ ఇన్‌ఛార్జులుగా మేడపల్లి యేసుబాబు, బుద్దా నాగేశ్వరరావుల పేర్లను చదివి వినిపించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అశోక్‌తో పాటూ పర్సన్ ఇన్ఛార్జులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… సాధించడం కంటే నిలబెట్టుకోవడం గొప్పని వ్యాఖ్యానించారు. ప్రజలే ఆత్మ బంధువులుగా, కార్యకర్తలే కుటుంబ సభ్యులుగా తాను మెలుగుతానని, అదేవిధంగా టిడిపి నాయకులంతా ఉంటేనే సమిష్టి బలం చేకూరుతుందన్నారు.
ప్రజల మధ్య తిరగని వైసిపి మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్యే చంటి, అలాకాకుండా ప్రజలకు దగ్గరగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మసలుకోవాలని హితవు పలికారు. కష్టించిన వారికి న్యాయం చేసేందుకు తాను ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నానని, భవిష్యత్తులో కష్టపడిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానంటూ పార్టీ శ్రేణుల కరతాళధ్వనుల మధ్య ఆయన హామీ ఇచ్చారు.
బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ… ప్రజలకు మరింత మంచి చేసేవిధంగా పదవులు పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి పరిశీలకులు మీరావలీ, ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.