The Desk…Eluru : దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు : ఎంపీ పుట్టా మహేష్

🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ :

దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

భారత ప్రభుత్వం ఇప్పటి వరకు క్రిప్టోకరెన్సీ వాడకం గురించి ప్రత్యేకంగా ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదని, క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 పరిధిలోకి 2023న మార్చి 7న కేంద్రం తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

వీటితో కూడిన లావాదేవీలకు ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద పన్నులు విధించబడుతున్నాయని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 కూడా కొన్ని సందర్భాల్లో వర్తిస్తుందని, కంపెనీలు వాటి ఆర్థిక నివేదికల్లో క్రిప్టో ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని కంపెనీ చట్టం- 2021లో 2013 మార్చి 24 జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం క్రిప్టో ఆస్తులను పరోక్షంగా పన్నుల విధానం, మనీలాండరింగ్ చట్టం, కంపెనీల వివరాల ప్రకటనల ద్వారా పర్యవేక్షిస్తోందని, నేరుగా నియంత్రణ కోసం అంతర్జాతీయ సహకారం అవసరం ఉందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఖాతాదారులను హెచ్చరిస్తూ సలహాలు జారీ చేసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.