The Desk…Eluru : వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

The Desk…Eluru : వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

  • తొలిరోజు సాయంత్రానికి 20 శాతం పంపిణీ..

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

జిల్లాలో 65ఏళ్ళు పైబడిన వృద్దులకు, వికలాంగులకు, మంచానికి పరిమితమైన వారికి రేషన్ షాపు డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరులో శనివారం జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో మొత్తం 76,193 మంది 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, మంచానికి పరిమితమైన కార్డుదారులు ఉన్నారని, వీరికి ప్రతినెల 26వ తేదీ నుండి ఆనెల చివరినాటికి డీలర్లు వారి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో 26వ తేది ఉదయం పంపిణీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 15,154 కార్డుదారులకు (19.89 శాతం) రేషన్ సరుకులు డీలరు ద్వారా డోర్ డెలివరీ చేయడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి విల్సన్, సిబ్బంది ఉన్నారు.