- మృతుని కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు.
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పటాపంచల గంగరాజు (35) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటికి మగదిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబం దీనస్థితిని స్థానిక నేతలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి తనవంతుగా రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో తన ప్రతినిధుల ద్వారా రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న తమకు ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా, తమ తరపున న్యాయస్థానంలో వాదించడానికి అడ్వకేట్ ను నియమించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టిడిపి నాయకుడు యనమందల సత్యనారాయణ (నాని), ఎంపీ మహేష్ కుమార్ పీఎస్ కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.