ఏలూరు జిల్లా : ఏలూరు/కైకలూరు : THE DESK : ఏలూరు జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, కైకలూరు మాజీ శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు (DNR), ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ లు సోమవారం ఉదయం ఏలూరులోని ఫైర్ స్టేషన్ రింగ్ రోడ్లో గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి నాయకులతో కలసి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా DNR మాట్లాడుతూ… వైస్సార్ అంటేనే ఒక అండ, ఒక దైర్యం, అటువంటి మహమనిషి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జగనన్న మనకు ఒక భరోసాను కల్పించారని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి అంటేనే అభిమానులు అయన మీద అభిమానంతో తరలి వచ్చారని అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు అందించిన బాధ్యతతో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇంచార్జ్లను, నాయకులను, కార్యకర్తలను కలుపుకుని వారితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి కార్యకర్తలందిరికి అండగా ఉంటానన్నారు. ముందుగా సర్వమత ప్రార్ధనలతో వైయస్సార్ ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్ధనలు చేసి ఆయన విగ్రహమునకు పాలాభిషేకం చేసి, పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అపర భగీరధుడు డా.వైస్సార్ పుస్తక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లనగోళ్ళ లక్ష్మి, డిప్యూటీ మేయర్లు గడదేశి శ్రీను, ఎన్ సుందర్ బాబు, కార్పొరేటర్లు జుజ్జువరపు విజయ నిర్మల, జయకర్, సాంబ, రాష్ట్ర మాజీ ఎస్సీ ప్రధాన కార్యదర్శి జాన్ గురున్నాధం, మాజీ ఏఏంసీ చైర్మన్ నిరుసు చిరంజీవి, రాష్ట్ర మాజీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహ్మద్ ఖైజర్, కైకలూరు ఏఏంసి చైర్మన్ చేబోయిన వీర్రాజు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కైకలూరు మాజీ పిఏసీయస్ అధ్యక్షులు పంజా రాంబాబు, పరింకాయల వెంకటేశ్వరావు, బలే నాగరాజు, ముంగర గోపాల కృష్ణ, నీలిపల్లి పైడిరాజు, ముండ్రు చార్లెస్, భావిశెట్టి స్వామి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
