ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ,యువకులకు సువర్ణావకాశం.
42 ప్రముఖ కంపెనీలు ద్వారా 3,500 పైగా ఉద్యోగాలు.
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సంయుక్తంగా పాల్గొన్నారు.
స్థానిక సిఆర్ రెడ్డి ఇంజనీరింగు కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా 42 ప్రముఖ కంపెనీలు ద్వారా 3,500 పైగా యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు ఉద్యోగాలు యువతీ, యువకులు కల్పించుటయే లక్ష్యంగా జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో 42 జాబు మేళాలు నిర్వహించి,2,400 ఉద్యోగాలు కల్పించామని అన్నారు.పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ బిజీ షెడ్యూల్ అయినా ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడల్లా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు.ఈ రోజున 42 ప్రముఖ కంపెనీలు ద్వారా 3,500 పైగా ఉద్యోగాలు కల్పించడం శుభపరిణామం అన్నారు.
మొదటగా వచ్చిన జాబు జీవితానికి తొలిమెట్టుగా భావించి మంచి అనుభవం పొంది భవిషత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని అన్నారు.సాయంత్రం వరకు కంపెనీలు ప్రతినిధులు ఉంటారని ప్రతి ఒక్కరూ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం పొందాలని అన్నారు.
ఉద్యోగమేళాలు అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నామని,ఇది నిరంతర ప్రక్రియ అని యువత సద్వినియోగం చేసుకుని జీవితాన్ని అందంగా మలుచుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.సిఆర్ రెడ్డి కళాశాల వారు ఉద్యోగ మేళాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి వారిని అభినందించారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు విద్య, ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కల్పించుటకు ప్రత్యేక దృష్టి పెట్టిందని అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తుందని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గట్టి హామీ ఇచ్చామని అందుకు అనుగుణంగా ఈ రోజున ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు.నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని సివిల్ ఇంజనీరు చదివి చిన్న కంపెనీలో రూ 12 వేలు జీతంతో 18 నెలల ఉద్యోగం చేశానని అన్నారు. ఆ అనుభవంతో ఈ రోజున 5 కంపెనీలు గ్రూప్స్ గా ఏర్పడి 4 వేల కోట్ల టర్నోవర్ తో వ్యాపారం అభివృద్ధి చేసి ఎంతో మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు.ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పార్లమెంటు సభ్యులు పోటీచేసే అవకాశం వచ్చిందని అందరీ సహకారంతో గెలిచి మరల ప్రజా సేవచేసే భాగ్యం కలిగిందని అన్నారు.మనకు తొలి సమయంలో జాబు రాలేదని దిగులు పడవద్దని జాబు మేళా నిరంతర ప్రక్రియ అని అన్నారు.గత ప్రభుత్వంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తిరిగి వెళ్ళారని,కూటమి ప్రభుత్వంలో మరల తిరిగి వస్తున్నారని నిరుద్యోగ యువతకు బంగారు భవిషత్ కు బాటలు వేస్తున్నామని అన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ…
మెగా జాబు మేళా యువతీ యువకులు జీవితాల్లో వెలుగులు నింపుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగం లభించినప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో మంచి పేరు గుర్తింపు వస్తుందన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ…
ఏలూరు పార్లమెంటు పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కృషి అభినందనీయం అన్నారు. ఈ రోజున ఒక్క జాబుకి 100 మంది పోటీ పడుతున్నారని, ఈ రోజున 42 ప్రముఖ కంపెనీలు 3,500 పైగా ఉద్యోగాలు కల్పించడం యువతకు మంచి రోజులు వచ్చాయని అన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ( చంటి) మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంటు శాఖ ద్వారా నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయిందన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంటు ద్వారా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తున్నాయని,తొలి ప్రయత్నంలో రాకపోయినా రెండు, మూడు ప్రయత్నాలలో తప్పక జాబు వస్తుందని జాబు మేళా నిరంతర ప్రక్రియ అని అన్నారు.

కార్యక్రమంలో ఏపి ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, హుడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాదు,జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్.జితేంద్రబాబు,సిఆర్ రెడ్డి కళాశాల సెక్రటరీ డా.యం.బి. యస్.వి.ప్రసాదు,కరస్పాండెంటు జాస్తి మల్లిఖార్జునుడు, ప్రిన్సిపాల్ డా.కె.వెంకటేశ్వర రావు,జిల్లా ప్లేస్మెంటు అధికారి కె.ప్రవీణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కో- ఆర్డినేటర్లు వి.రవిశ్యామ్, కె.రాంబాబు, వి.కిషోర్,కార్తీక్, రామ కృష్ణ, నాగరాజు,రామ కృష్ణ నాయుడు,సురేష్, సత్యనారాయణ,శ్యామ్ భూషణ్,వివిధ కంపెనీల ప్రతినిధులు,వారి టెక్నికల్ బృందం,నిరుద్యోగ యువత వారి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

