- ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణావకాశం..
- జులై 14న ఏలూరు సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఉదయం 9.30 గంటల నుంచి..
- 39కి పైగా ప్రముఖ సంస్ధల్లో 3 వేల ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహణ..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్:
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా జులై 14న ఉదయం 9.30 గంటల నుంచి ఏలూరు సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుంది.
ఈ జాబ్ మేళాకు 39కి పైగా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై 3 వేల మందిని అర్హత ప్రామాణికంగా … 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బిటెక్, తదితర కోర్సులు పూర్తి చేసిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కాగా.. అర్హత గల అభ్యర్దులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్ధులు ముందుగా ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ లింకు https://naipunyam.ap.gov.in/user-registration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ లో రెస్యూమ్ తీసుకొని హాజరుకావాలని సూచించారు.
పూర్తి వివరాలకు 9493482414, 8978524022, 8143549464, 9618194377, 9885519299. నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

