- టిడిపి శ్రేణులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయo : ది డెస్క్ :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సాధికార సారథి నుంచి ప్రతి ఒక్క టీడీపీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ కోరారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఎంపీ సూచించారు.
ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని “మై టీడీపీ యాప్”లో నమోదు చేయాలని ఎంపీ తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల పనితీరు పార్టీకి తెలుస్తుందని ఎంపీ పేర్కొన్నారు. నెల రోజుల పాటు విధిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములు కావాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.