ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు ఏరియా మహాసభలలో 2వసారి ఏరియా కార్యదర్శిగా ఎన్నికైన ఉప్పులూరి హేమ శంకర్ ను ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో ఏళ్లుగా ఆటోనగర్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మాజీ అధ్యక్షుడు మాగంటి నాగభూషణం చేసిన అరాచకాలపై పోరాటాలను నిర్వహించిందని తెలిపారు.
అనంతరం అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడిన సందర్భంలో జరిగిన అనేక సందర్భాల్లో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొని నూతన కమిటీకి సంఘీభావాన్ని మద్దతును తెలియజేసిందని వివరించారు. భవిష్యత్తులో నూతన కమిటీని ఇబ్బంది పెడుతున్న మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం చర్యలకు వ్యతిరేకంగా,ఆటోనగర్ అభివృద్ధి లక్ష్యంగా, అసోసియేషన్ కమిటీకి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు,కార్యదర్శి అడపా సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు మహమ్మద్ సులేమాన్,ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు,కమిటీ సభ్యులు షేక్ జిల్ఫీ, సిగిరెడ్డి సంజీవరావు, సయ్యద్ చోటే,చిట్యాల పూర్ణచంద్రరావు, ది ఏలూరు కార్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు మహబూబ్ షరీఫ్,సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు.