ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
ఉత్తమ సేవా పతకాలు పొందిన జిల్లా సమాచార శాఖ కార్యాలయ ఉద్యోగులను డిపిఆర్ఓ ఆర్.వి.ఎస్. రామచంద్రరావు అభినందించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా పతకాలు అందుకున్న డివిజనల్ పిఆర్ఓ సిహెచ్.కె. దుర్గాప్రసాద్, సహాయక సమాచార ఇంజనీరు కె. ధనుంజయరాజు, ఉత్తమ ఫొటో గ్రాఫర్ పి. సాగర్ లను అభినందించారు. ఇదే విధంగా మరింత ఉత్తమ పనితీరు కనబరచి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ పతకాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా అధికారుల విభాగంలో జిల్లా పౌర సంబంధాధికారి ఆర్. వి. ఎస్. రామచంద్రరావు ను కార్యాలయ సిబ్బంది అందరూ అభినందించారు.