- సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

దీర్ఘకాలికంగా నెలకొన్న కొల్లేరు సమస్యకు మానవీయ కోణంలో శాశ్వత పరిష్కారం చూపించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర కమిటీకి విజ్ఞప్తి చేశారు.
కొల్లేరు సమస్యను అధ్యయనం చేసేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం వినతులు స్వీకరించిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించారు.
కొల్లేరు ప్రాంత వాసులు తమ జీవనోపాధి కొరకు వారి కోరిక మేరకు జిరాయితి, డి. ఫామ్ పట్టా, మత్స్యకారుల సొసైటీ భూములు, గ్రామాల్లో మంచినీటి చెరువులు, పశువుల చెరువులు, నివేశన స్థలాలు, స్మశాన వాటికలు, ఆటస్థలాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన భూములను పక్షుల అభయారణ్యం నుంచి తొలగించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన నివేదికలో కోరారు.
కొల్లేరు ప్రాంత వాసులు, రైతుల మనోభావాలను గౌరవిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని తన నివేదిక ద్వారా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విన్నవించారు.