🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని, హృదయ విదారక ఘటనగా ఎంపీ అభివర్ణించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ఎంపీ వ్యక్తం చేశారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.