🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు నగర అభివృద్ధి సంస్థ (ఈ.యు.డి.ఏ) చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పెద్దిబోయిన శివప్రసాద్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు.
ఏలూరు ఈ.యు.డి.ఏ కార్యాలయంలో చైర్మన్ శివప్రసాద్ ను ఎంపీ మహేష్ కుమార్ బుధవారం కలిశారు. చైర్మన్ శివ ప్రసాద్ కు ఎంపీ మహేష్ కుమార్ పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎంపీ ఆకాంక్షించారు. ఏలూరు నగర అభివృద్ధి ద్యేయంగా పనిచేసి పదవికి వన్నె తీసుకురావాలని ఎంపీ సూచించారు.
ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపే విషయంలో తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన శివప్రసాద్ కు అధిష్టానం చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పించిందని ఎంపీ తెలిపారు. అనంతరం ఈ.యు.డి.ఏ చైర్మన్ శివప్రసాద్, అధికారులు ఎంపీ పుట్టా మహేష్ కు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.