- ఈనెల 29న రేషన్ షాపుల్లో ఈఫోస్ పరికరాలను ట్రైయిల్ రన్ నిర్వహించాలి..
- చౌకధర దుకాణాల డీలర్లు తమ షాపుల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేయాలి..
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకుల సరఫరాకు సర్వసన్నధ్ధంగా ఉండాలని రేషన్ డీలర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో చౌకధర దుఖాణాల డీలర్లకు ఏలూరు జిల్లాలోగల అందరూ పౌరసరఫరాల డిప్యుటీ తహసిల్దార్లకు జూన్ 1 తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ విషయంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో ఉన్న మొత్తం 1123 డీలర్లు వారి యొక్క చౌకధర దుకాణముల వద్ద అందరికీ కన్పించేలా స్టాక్ బోర్డు ప్రదర్శించాలన్నారు జిల్లాలో మొత్తం 1123 చౌకధర దుకాణాలలో 13 ఆఫ్ లైన్ చౌకధర దుకాణములు ఉన్నాయన్నారు.
అన్ని చౌకధర దుకాణాల ప్రాంగణాలు తిరిగి తెరవడానికి ముందు పూర్తిగా శుభ్రం చేయబడాలని, పరిసర ప్రాంతం కూడాను పరిశుభ్ర వాతావరణంలోవుంచి కార్డు దారులకు సరుకులు అందేల సమర్థవంతమైన, పారదర్శకంగా సేవలను అందించడానికి ఇది మంచి అవకాశం అవుతుందన్నారు. అన్ని చౌకధర దుకాణాలను పూలతో అలంకరించి పండుగ వాతావరణం లో స్థానిక ప్రజాప్రతినిథులతో మరియు సీనియర్ సిటిజెన్స్ తో పునః ప్రారభించవలసినదిగా ఆదేశించారు.
పీడీఎస్ పంపిణీ తిరిగి ప్రారంభం, సమయాలు, లబ్ధిదారుల సూచనలతో సహా బ్యానర్లు, స్థానిక ప్రకటనలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచార రీతిలో తగినంత ప్రచారం ఇవ్వాలన్నారు. తమ పరిధిలోని ప్రతి కార్డు దారునికి చౌకధర దుకాణాల ద్వార రేషన్ పంపిణి జరుగునని తెలియజేయాలన్నారు. చౌకధర దుకాణాలలో ఈసీలను పంపించే ముందు ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద సరైన తూకం నిర్దారించుకోవాలన్నారు.
చౌకధర దుకాణాల డీలర్లు వారి యొక్క షాపుల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చౌకధర దుకాణాల డీలర్లు సరఫరా చేసిన ఈసీలకు కార్డుదారుల నుండి అధిక మొత్తాన్ని వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. యూపీఐ/ ఆన్లైన్ చెల్లింపు లు వినియోగించాలన్నారు.
పంపిణీ ప్రారంభానికి ముందు అన్ని ఈ-పోస్ యంత్రాలను విజన్ టెక్ బృందం మిషన్ మోడ్‌లో తనిఖీ చేసి సరిచేయాలన్నారు. మెషిన్ నెట్వర్క్ సౌకర్యం కూడా పునరుద్దరించుకోవాలని విజన్ టెక్ వారికి ఆదేశించారు. పంపిణీ కార్యకలాపాలకు సంసిద్ధత నిర్దారించడానికి అన్ని రేషన్ షాపులు ఈ-ఫోస్ పరికరాలను ఈనెల 29వ తేదీన ట్రైయిల్ రన్ నిర్వహించుకోవాలన్నారు.
సమావేశంలో డిఎస్ఓ పి. శివరామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, సివిల్ సప్లైయిస్ డిటిలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.