ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరియు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధమున్సిపల్ సర్కిల్ ఆఫీసుల దగ్గర మేడే ఏఐటీయూసీ పతాకం ఆవిష్కరించారు. మున్సిపల్ ఆఫీస్ స్తూపం దగ్గర ఏఐటీయూసీ మేడే జండాలు ఆవిష్కరించారు.
139వ మేడే వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు. ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వివిధ సర్కిల్ నందు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మేడే జెండా ఆవిష్కరణలు సభ జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏ.పీమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు R శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు p. కిషోర్ లు మాట్లాడుతూ… 1886 లో కార్మికుల 8గంటల పనికోసం జరిగిన మహత్తర పోరాటం మేడే అని కొనియాడారు. మేడే పోరాట స్ఫూర్తితో ఏఐటీయూసీ దేశంలో స్వాతంత్రం ముందు నుండి పోరాడనేక కార్మిక చట్టాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న డిఎ ఇంక్రిమెంట్ ఎర్న్ లీవ్ లను మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏలూరు నగర నాయకులు భాస్కర్ రావు, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు క్రాంతి, యూనియన్ సభ్యులు పేడారి వంశీ, డి రవీంద్ర, శాఖ భాస్కరరావు .నవీన్ .దొడ్డిగర్ల నాగబాబు .రవి. వీరబాబు కొండ .అంతరాజు కిరణ్ .ప్రసాద్, అంతరాజులీల ప్రసాద్, కాకాని సుబ్బారావు, ఇంటి అశోక్, బంగారు లక్ష్మీనారాయణ, మీసాల చంద్రమౌళి, కసింకోట నాగేంద్ర, పుచ్చ మరియదాసు. చేయబోయిన భాస్కరరావు, .బంగారు దేవేంద్ర, బట్టు కృష్ణ, బంగారు మధు, కెదుర్గారావు, మధు తదితరులు పాల్గొన్నారు
భజంత్రీ శ్రీనివాస్ (ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఏలూరు జిల్లా కార్యదర్శి