ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్…
వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
మంత్రివర్గం ఆమోదించడం ద్వారా కులగణన విషయంలో కేంద్రంలోని ఎన్జీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైందని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
కులగణనను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆచరణలో చూపిందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
కులగణన చేపట్టడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, ప్రభుత్వ పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరడానికి వీలుందని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..