🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని, జీవితం రెండవ అవకాశం ఇస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మనోధైర్యం కల్పించారు.
మే 19 నుండి 28 వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణత శాతం 81.14% రావడం వెనుక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యల ఫలితం అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
మొత్తం 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం సంతోషం కలిగించిందని ఎంపీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో 77.24 శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందనలు తెలిపారు.