ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. జంగారెడ్డిగూడెం తపస్ కళాశాలకు చెందిన విద్యార్థి కె. జైత్ర ఎంపీసీలో 464 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థి జైత్ర బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి జైత్రను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించి, శాలువా కప్పి సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఉన్నతికి చేరుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.