The Desk…Eluru : అట్టహాసంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

The Desk…Eluru : అట్టహాసంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

  • టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, బాలింతలు, గర్భిణులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

శాంతినగర్ లోని ఎంపీ మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.

టిడిపి ప్రొఫెషనల్ వింగ్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఆరేపల్లి శివ ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతూ శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్రవైద్య నిపుణులు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

అనంతరం మాదేపల్లి లోని ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. కూటమి నాయకులు షేక్ కరీముల్లా, నందిగం రవిచంద్ర (నాని) ఆధ్వర్యంలో కోటదిబ్బలో గల మూగ, చెవిటి ఆశ్రమంలో దివ్యాంగులకు అన్నదానం చేశారు.

కార్యక్రమంలో నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, రెడ్డి నాగరాజు, నందిగం సీతారామ తిలక్ (బాబి), ఆర్ఎన్ఆర్ నాగేశ్వరావు, కాట్రు బాలకృష్ణ, త్రిపర్ణ రాజేష్, పి. సంధ్య, ఆలూరి రమేష్, శాఖమూడి మహేష్, షేక్ కరీముల్లా, అశోక్ గజపతిరాజు, మఠం బాలు, విశ్రాంత జడ్పి సీఈఓ కుమారస్వామి, ఎంపీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.