The Desk…Eluru : కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ట్రాయ్ సిఫార్సుల అమలు : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ట్రాయ్ సిఫార్సుల అమలు : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఐ.ఎక్స్.పీ, ఐ.ఎస్.పి మధ్య వ్యత్యాసం, ఐ.ఎస్.పీలకు ఐ.ఎక్స్.పీ కోసం లైసెన్స్ అవసరం, ఐ.ఎక్స్.పీ లైసెన్సింగ్‌లో లోటుపాట్లు, ఐ.ఎక్స్.పీ నిబంధనల కోసం తీసుకున్న ప్రణాళికాబద్ధమైన సంస్కరణలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసారాలు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 2022 నవంబరు18న ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ పాయింట్లు గురించి కొన్ని సిఫార్సులు చేసిందని, ట్రాయ్ ఈ సిఫార్సులను డేటా సెంటర్లు, కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లు, ఇంటర్‌కనెక్ట్ ఎక్స్‌ఛేంజ్‌ల ద్వారా డేటా ఎకానమీని అభివృద్ధి చేయడానికి సూచించిందని అయితే ట్రాయ్ ఇచ్చిన సిఫార్సులు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

విధానపరమైన అంశం కాబట్టి ఎప్పుడు అమలు అవుతుందో చెప్పడం కష్టమని, ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ పాయింట్ అనేది వివిధ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఒకరితో ఒకరు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మార్పిడి చేసుకునే ప్రదేశమని, ఐ.ఎక్స్.పిలలో నెట్‌వర్క్ స్విచ్‌లు ఉంటాయని, ఇవి కనెక్ట్ అయిన ఐ.ఎస్.పిల మధ్య డేటా మార్పిడి చేయడంలో సహాయపడతాయని, అయితే, ఐ.ఎక్స్.పిలు నేరుగా వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందించవని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా) 2003లో స్థాపించబడిందని, అయితే ఐ.ఎస్.పి లైసెన్స్‌ను 2024 డిసెంబరులో పొందిందని, ఈ పొరపాటు పాలసీ లోపం వల్ల జరిగిందని, ఈ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం ఐ.ఎక్స్.పిల కోసం ప్రత్యేకమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేకపోవచ్చని, కానీ ట్రాయ్ సిఫార్సులను ప్రభుత్వం సమీక్షిస్తున్నందున భవిష్యత్తులో కొత్త పాలసీలు వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి తెలిపారు.