🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హైవేకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
ఈ మేరకు దిల్లీలోని కార్యాలయంలో అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవేకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాల్సిన అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలపై అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి నిధుల మంజూరులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విన్నవించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నూజివీడు నుంచి ముసునూరు మీదుగా ఏలూరుకు వెళ్లే ఎన్.హెచ్-216 హెచ్ రహదారిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఫ్లై-ఓవర్ నిర్మాణం, ఎన్.హెచ్-216 రహదారిలో 70.385 వద్ద ఉన్న కల్వర్టు నిర్మాణం, మచిలీపట్నం ఓడరేవుకు కార్గో రవాణా చేసే వాహనాల వల్ల ఏర్పడే భారీ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తుక్కులూరు నుంచి నూజివీడు మున్సిపల్ ఏరియా చివరి వరకు ఇరువైపులా 6 కి.మీ సర్వీస్ రోడ్డు కనెక్టివిటీ, నూజివీడు నుంచి ముసునూరు మీదుగా ఏలూరు కూడలి వరకు ఫ్లైఓవర్ నిర్మాణం, తుక్కులూరు వద్ద నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా నూజివీడు 216 హెచ్ రహదారి 69 కి.మీ వరకు మరో ఫ్లైఓవర్ నిర్మాణం, జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వయా కన్నాపురం వరకు ప్రతిపాదిత జాతీయ రహదారి 365 బీబీ ప్రాజెక్ట్ హైవే అలైన్‌మెంట్‌ను కన్నాపురం ఆనుకుని బైపాస్ రోడ్డుగా మార్చారని, కాబట్టి పాత అలైన్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని, కైకలూరు నియోజకవర్గంలోని వడ్లమన్నాడు- పెదలంక వయా గురువాయుపాలెం, సంతోషపురం, భాస్కరావుపేట, పెదలంక ఎస్.హెచ్-304, ఎస్.హెచ్-231 పరిధిలోని వడాలి- తాడినాడ, భీమవరం- గుడివాడ, కైకలూరు- కలిదిండి రహదారుల విస్తరణ, అభివృద్ధికి సిఆర్ఐఎఫ్ పథకం కింద రూ.289.00 కోట్లు మంజూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో శిధిలావస్థకు చేరి దెబ్బతిన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్‌గా 7 మీటర్లు మేర అభివృద్ధి, రవికంపాడు, చింతలపూడి, దిగవల్లి- వలసపల్లి రహదారుల విస్తరణకు సిఆర్ఐఎఫ్ నిధులు రూ.101 కోట్లు మంజూరు, ఎన్ హెచ్ 216ఎ, 365బీజీ, ఎన్ హెచ్ 16పై లింగగూడెం, కమలాపురం, రాఘవాపురంలో పామాయిల్ రైతులు పండించిన పంట ఉత్పత్తులు తరలించడానికి వీలుగా కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం, ఖమ్మం నుండి దేవరాపల్లి ఎన్.హెచ్ 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నేపథ్యంలో కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం, ఏలూరు జిల్లా పరిధిలోని ఖమ్మం-దేవరపల్లి 365 బిజి నేషనల్ హైవే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ వెంబడి సర్వీస్ రోడ్ల నిర్మాణం, ఖమ్మం-దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉన్న 4-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే మరియు చింతలపూడి మండలం గురుబట్లగూడెం నుంచి రేచర్ల-గురవాయిగూడెం వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణం, దెందులూరు మండలం సీతంపేట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, గుండుగొలను నుండి కొవ్వూరు రోడ్డు వరకు ఎన్. హెచ్-16లో సీతంపేట జంక్షన్ వద్ద 4 మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్ట్ లేదా పీయుపీ, సీయుపీ నిర్మాణం, గుండుగొలను దేవరపల్లి-కొవ్వూరు జంక్షన్లో ఓవర్‌బ్రిడ్జి మధ్య సర్వీస్ రోడ్డు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి గుండుగొలను వరకు నిర్మించిన సర్వీస్ రోడ్ల వెంబడి లైటింగ్‌ను మెరుగుపరచడం, ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను, భీమడోలు, కూరెళ్లగూడెం, పూళ్ల, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్, సబ్ వేల నిర్మాణం, ఏడు బ్లైండ్ స్పాట్ ప్రాంతాల్లో సర్వీసు రోడ్డుతో కలిగిన ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.
అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ సానుకూలంగా స్పందించిన అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.