The Desk…Eluru : ఏపీలో నిలిచిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రూ. 226.7 కోట్లు మంజూరు : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : ఏపీలో నిలిచిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రూ. 226.7 కోట్లు మంజూరు : ఎంపీ పుట్టా మహేష్

:

దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఏలూరు జిల్లాలో మధ్యతరగతి వర్గాల గృహాల కోసం ప్రత్యేక విండో కింద లబ్ధిదారులకు మంజూరు చేసిన నిధులు, వారికి అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

మధ్యతరగతి గృహాల కోసం ప్రత్యేక విండో ద్వారా నిధులు సమకూర్చబడిన ప్రాజెక్ట్‌ల కింద 50 వేల గృహాలు పూర్తయ్యాయని, 2025 ఫిబ్రవరి 28 నాటికి 40 వేల అదనపు యూనిట్లను పూర్తి చేయడానికి ఫండ్ సదుపాయం కల్పిస్తోందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

వివిధ రాష్ట్రాలలో నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులను పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతి సాధించబడిందని, ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాజెక్టుల్లో 970 గృహాలకు రూ.226.7 కోట్లు మంజూరు చేయగా, 2025 మార్చి 7 నాటికి రూ.146.1 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.మధ్యతరగతి గృహాల కోసం ప్రత్యేక విండో (SWAMIH)ఫండ్ కింద ఆంధ్ర ప్రదేశ్‌లోని కాజా, వైజాగ్, ఏలూరు ప్రాంతాలల్లో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఎలాంటి నిధులు కేటాయించలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మధ్యతరగతి గృహాల కోసం ప్రత్యేక విండో (SWAMIH) ఫండ్ పై అవగాహన కల్పించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ వంటి సంస్థలు నిర్వహించే వివిధ సదస్సుల్లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.