The Desk…Eluru : సమస్య ఏదైనా పరిష్కారంలో ముందుంటా… సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : సమస్య ఏదైనా పరిష్కారంలో ముందుంటా… సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్య ఏదైనా పరిష్కరించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్ లోని కార్యాలయంలో శనివారం సాయంత్రం రైల్వే, ఎన్.హెచ్, ఆర్.అండ్.బి శాఖల ఉన్నతాధికారులతో ఎంపీ మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రధానంగా ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గంలోని రైల్వే, జాతీయ రహదారులు, ఆర్.అండ్.బి రహదారుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే గుర్తించిన సమస్యలకు సంబంధించి నిధుల మంజూరు నిమిత్తం అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.

జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఎంపీ తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

అలాగే పొగాకు రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను ఇప్పటికే టొబాకో బోర్డు చైర్మన్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వెల్లడించారు.