- ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
- ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఏలూరు 47వ డివిజన్ తంగెళ్ళమూడి తిలక్ నగర్ పాత మసీదులో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మనుషుల మధ్య సోదరభావం, సమానత్వాన్ని పెంపొందించే పండుగే రంజాన్ అన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో సమానత్వం నింపేదుకు ఇఫ్తార్ విందులు దోహదపడతాయన్నారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.