The Desk…Eluru : చలివేంద్రాలు – మజ్జిగ పంపిణీ కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయండి

The Desk…Eluru : చలివేంద్రాలు – మజ్జిగ పంపిణీ కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయండి

  • టిడిపి శ్రేణులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి చలివేంద్రం ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.వేసవి తీవ్రత నేపథ్యంలో పాదచారుల దాహార్తి తీర్చడానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏలూరు 24వ డివిజన్ టిడిపి ఇంచార్జ్ కడియాల విజయలక్ష్మి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ప్రారంభించారు.

ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.