The Desk…Eluru : ఐదేళ్లలో రూ.1,641 శ్రీనిధి నిధులు వినియోగం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రమంత్రి

The Desk…Eluru : ఐదేళ్లలో రూ.1,641 శ్రీనిధి నిధులు వినియోగం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రమంత్రి

🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

గత ఐదేళ్లలో సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ (శ్రీ నిధి)కి విడుదల చేసిన నిధులు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పరిధి విస్తరణపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే గురువారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్ 2020లో ప్రకటించబడిందని, ఈ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి రూ.10 వేల కోట్లు, ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారా రూ.40 వేల కోట్లు ఉందని, అమలుకు సంబంధించి ఎలాంటి సర్వే చేపట్టలేదని కేంద్ర మంత్రి తెలిపారు.

శ్రీనిధి కింద ఆంధ్రప్రదేశ్ లో మూడు కంపెనీలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల కావని, 2025 ఫిబ్రవరి 28 నాటికి 577 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రూ.10,979 కోట్లు ఆర్థిక సాయం అందించగా, రూ.1,722 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఐసి వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ కి విడుదల చేయగా రూ.1,641.90 కోట్లు వినియోగించినట్లు కేంద్రమంత్రి బదులిచ్చారు.