ఏలూరు జిల్లా: ఏలూరు The Desk : ఏలూరు పార్లమెంట్ ప్రజలు సంవత్సరంన్నరగా వేచిచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ హాల్టు కలను కేవలం రెండు నెలలకాలంలో నెరవేర్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్ మరియు టిడిపీ జిల్లా అద్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలసి ఏలూరు రైల్వే స్టేషన్లో వందలాదిగా తరలివచ్చిన జిల్లా ప్రజలు కేరింతల నడుమ ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద తొలుత వందే భారత్ రైలుకు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ ను అరటి చెట్లు, బేలున్లులతో అలంకరించి, ప్రయాణికులకు స్వీట్లును ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పంచారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ… జిల్లా ప్రజలు రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. వందే భారత్ రైలు విద్యార్థి, ఉద్యోగ వర్తక వాణిజ్య వర్గాలకు ఉపయోగం అన్నారు. తద్వారా జిల్లాకు పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విశాఖపట్నం, సికింద్రాబాద్, విజయవాడ మరియు రాజమండ్రి వెళ్ళే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందన్నారు. వందే భారత్ రైలు ఏలూరు హాల్టు రావటానికి సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రమంత్రి వర్యులు నారా లోకేష్ కు ఎంపీ పుట్టా మహేష్ కూమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తేలిపారు.
జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్ లు మరియు టిడిపీ జిల్లా అద్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే వందే భారత్ రైలు కు హాల్టు సాధించినందుకు ఎంపీ పుట్టా మహేష్ కూమార్ ను అభినందనలతో ముంచెత్తారు. తదుపరి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరియు వారి బృందం అదే రైలులో విజయవాడ వరకూ ప్రయాణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు పీ ఇ ఎడ్విన్, టీ.సురేష్, సత్యస్వరూప్, పి.సతీష్, యండీ ఆలీఖాన్, ఏలూరు రైల్వేస్టేషన్ మాస్టర్ రమేష్, రైల్వే అధికారి కిరణ్ మరియు రైల్వే వివిధ శాఖ అధికారులు, రిల్వే స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, వేలాదిగా జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.