ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దులు గుర్తించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దులు అంశంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ..
జి.ఓ. 120 ననుసరించి కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల సర్వే ను రెవిన్యూ, సర్వే, అటవీశాఖల సిబ్బందితో సర్వే బృందాలను నియమించి నిర్దేశించిన సమయంలోగా జి.ఓ 120 ప్రకారం కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, అటవీ శాఖాధికారులు ఆశా కిరణ్, పి . విజయ, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, మత్స్య శాఖ జేడీ నాగలించార్యులు, సర్వే ఏడి అన్సారీ, తహసీల్దార్లు సుమతి, రమాదేవి, పూర్ణ చంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.