The Desk…Eluru : మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం : ఎంపీ మహేష్ కుమార్

The Desk…Eluru : మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం : ఎంపీ మహేష్ కుమార్

  • ఏలూరు నియోజకవర్గ స్థాయి టిడిపి సర్వసభ్య సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ వెల్లడి

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు నగరాన్ని మేజర్ సిటిగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టిడిపి నియోజకవర్గస్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఏలూరు జిల్లా అనువైన ప్రాంతంగా ఉందని, ఈ నేపథ్యంలో ఇక్కడికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపినట్లు ఎంపీ తెలిపారు. రానున్న నాలుగేళ్లలో శాశ్వత నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఎంపీ వెల్లడించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని, రాజకీయాలు చేయాలనుకుంటే చివరి ఆరు నెలలు సరిపోతుందని, ప్రస్తుతం నాయకులు కూడా అభివృద్ధి గురించే చర్చించాలని ఎంపీ సూచించారు. అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు ఒక్క మాట మీద ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చెప్పినట్లు నడవాలని ఎంపీ సూచించారు.

ఏలూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఎంతో కష్టపడుతున్నారని.. నాయకులు, కార్యకర్తలు అడిగితే ఎమ్మెల్యే సొంత పనిలా చేస్తున్నారని ఎంపీ కొనియాడారు.

ఎంఎల్ఏ బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఏలూరు వాసులుగా మనందరిపై ఉందని తెలిపారు.

ఎంపీ మహేష్ కుమార్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి తనంత శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎంఎల్ఏ పార్టీ శ్రేణులకు సూచించారు.