The Desk…Eluru : ఏలూరులో టూవీలర్ వెహికల్స్ పై 63 కేసులు నమోదు చేసిన ఆర్టీవో అధికారులు

The Desk…Eluru : ఏలూరులో టూవీలర్ వెహికల్స్ పై 63 కేసులు నమోదు చేసిన ఆర్టీవో అధికారులు

🔴 ఏలూరు జిల్లా: ఏలూరు : ఉప రవాణా కమిషనర్ కార్యాలయం : ది డెస్క్:

ఏలూరు పట్టణములోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం ద్విచక్ర వాహనాలపై వాహన తనిఖీ అధికారులు 63 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు.

ఇందులో హెల్మెట్ ధరించని, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని మరియు వాహన భీమా కలిగిలేని ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు వి.ఎల్. కళ్యాణి, పి.నరేంద్ర బాబు, డి.ప్రజ్ఞ పాల్గొన్నారు.

ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రతి యొక్క ద్విచక్ర వాహనదారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని కరీమ్ ద్విచక్ర వాహనదారులను కోరారు.