The Desk…Eluru : నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు…విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

The Desk…Eluru : నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు…విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

  • పగడ్బందీగా ఇంటర్ పరీక్షలు
  • నో సెల్ ఫోన్ జోన్ గా పరీక్షా కేంద్రాలు
  • కంట్రోల్ రూమ్ నె0..08812-230197

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తేదీన ఫస్టియర్‌, మూడో తేదీన సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.మొత్తం 33,511 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

విద్యార్ధులు ఉదయం 8.30 కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అన్ని పరీక్షా కేంద్రాలలో మొత్తం 720 సిసి కెమేరాల నిఘా పెట్టారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్ గా నిర్ధేశించడం జరిగింది ,పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08812-230197 ఫోన్ నెంబరుతో ఏర్పాటు చేశారు.

హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్ధులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫోన్ చేయవచ్చు,అదేవిధంగా వాట్స్ అప్ లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా 3 ఫ్లైయింగ్ స్కాడ్లు, 4 సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేసారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్ల ను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష ముగిసేవరకు ఆయా షాపులను మూసివుంచాలిని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.

అన్ని పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. త్రాగునీరు ఏర్పాట్లను చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్-163 బి సెక్షన్ అమల్లో ఉంటుంది.