The Desk…Eluru : ఏలూరులో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

The Desk…Eluru : ఏలూరులో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

  • ఉదయం పరీక్షకు 87.90 శాతం మంది మధ్యాహ్నం పరీక్షకు 87.81 శాతం అభ్యర్థులు హాజరు

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ కె.వె ట్రిసెల్వి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 6 పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

ఆదివారం ఏలూరు వట్లూరులోని సి అర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల,సిఆర్ రెడ్డి మహిళా కళాశాల,ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉదయం సెషన్‌లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది (87.90శాతం)హాజరుకాగా.. 534 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

రెండో సెషన్స్ లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది (87.81 శాతం )అభ్యర్థులుహాజరుకాగా.. 537 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్ వున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి కో ఆర్డినేషన్ అధికారిగా వ్యవహరించారు.