- ఢిల్లీలో జరిగిన భారత ఇంధన వారోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ :

ఇంధన రంగంలో అత్యవసర సవాళ్లను అధికమించడంపై దృష్టి సారించాల్సి ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), DMG ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో భారత ఇంధన వారోత్సవం ఢిల్లీలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు జరిగే భారత ఇంధన వారోత్సవాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇంధన రంగంలో కొత్త ఆవిష్కరణల ద్వారా ఇంధన రంగం భవిష్యత్తును రూపుదిద్దే అవకాశాన్ని ఇది కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నిర్వహకులు, ఔత్సాహికులు, నిపుణులను ఏకం చేసే అతి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ఈవెంట్ గా నిలుస్తుందని ఎంపీ మహేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల డైనమిక్ వేదికలో ఉన్నత స్థాయి చర్చలు, వ్యాపార నెట్‌వర్కింగ్, వంటివి ఎనర్జీ రంగంలో సహకారాన్ని ప్రోత్సహిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు.
ఇండియా ఎనర్జీ వీక్ కాన్ఫరెన్స్‌లు ప్రపంచ స్థాయి ఎనర్జీ ప్రతినిధులు, విధాన నిర్ణయకర్తలు, నిపుణులు నడిపించే ఆలోచనాత్మక సమావేశాలను అందిస్తాయని, ఇందులో ఎనర్జీ భద్రత, సుసంస్కరణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, తక్కువ కార్బన్ భవిష్యత్తుకు మార్పు వంటి కీలక అంశాలు ఈ వార్షికోత్సవాల్లో చర్చించారని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
700 కంటే ఎక్కువ గ్లోబల్ ఎగ్జిబిటర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించగా, 70 వేలకు పైగా ప్రతినిధులు హాజరై తాజా ఆవిష్కరణలను అన్వేషించేందుకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకునేందుకు ప్రపంచ స్థాయిలో ఎనర్జీ భవిష్యత్తును రూపుదిద్దేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.