🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : THE DESK NEWS :
గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 6వ రోజు సందర్భముగా అమ్మవారు ప్రత్యేక మయూర (నెమలి ఫించములతో) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
6వ రోజు సందర్భంగా..ఈ రోజు రాత్రి 9 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప పేరు ప్రఖ్యాతిగాoచిన వైజాగ్ వారి రోషన్ లాల్ ఆర్కెస్ట్రా తో కలిసి ప్రముఖ సినీ గాయని లక్ష్మీ గాయత్రి (భీమ్లా నాయక్, అఖండ) గొప్ప సినీ సంగీత విభావరి ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ.
ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మా గాలయగూడెం గ్రామము తరపున మరియు శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఆలయ కమిటీ.