The Desk…Eluru : హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని ద్విచక్ర వాహన చోదకుల పై 35 కేసులు నమోదు

The Desk…Eluru : హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని ద్విచక్ర వాహన చోదకుల పై 35 కేసులు నమోదు

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రవాణా శాఖ వాహన తనిఖీ అధికారులు శుక్రవారం వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద సుమారు 130 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించనవి, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటివి తదితర తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 35 కేసులు నమోదు చేసి 5 వాహనాలను సీజ్ చేశారు.

ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చిన రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి వాహన తనిఖీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిలో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతను మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలను వివరిస్తూనే రహదారి భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఎండి జమీర్ కళ్యాణి నెహ్రూ పి నరేంద్రబాబు డి. ప్రజ్ఞ పాల్గొన్నారు.