The Desk…Eluru : డ్రైవింగ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి : ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు

The Desk…Eluru : డ్రైవింగ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి : ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు

  • డ్రైవర్ వృత్తి గౌరవప్రదమైనది..
  • డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ..

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

డ్రైవర్ వృత్తి గౌరవప్రదమైనదని.. వారి ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం స్ధానిక ఉపరవాణా కమీషనరు కార్యాలయ ఆవరణలో రోడ్డు భధ్రత మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఆయుష్ ఆసుపత్రి ఏలూరు వారిచే డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఇన్ చార్జి ఉపరవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. డ్రైవర్ వృత్తి గౌరవప్రదంతో కూడిందని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందని తెలిపారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు డ్రైవర్లకు ఆయుష్ ఆసుపత్రి ఏలూరు వారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, శంకర్ నేత్రాలయం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి డ్రైవర్లకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి డ్రైవర్ వారి కుటుంబంపై ఎంతో బాధ్యత తీసుకుంటారో అదే విధంగా డ్రైవింగ్ లో ప్రభుత్వం వారు డ్రైవింగ్ నిబంధనలో పాటించి డ్రైవింగ్ చేయడం ద్వారా తనకు రక్షణతో పాటు ప్రయాణికుల రక్షణ ఉంటుందని అన్నారు . డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం సేవించకూడదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, టూ వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, పరిమితిని మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించుకోరాదని, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు లో మాట్లాడకూడదని, ఉన్నారు.

రహదారి భధ్రత పాటిస్తే మీ జీవితానికి రక్ష అన్నారు. గతంలో ప్రమాదంలో గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి భయపడే వారిని కారణం వారిపేర్లు నమోదుచేసి కోర్టులో సాక్షులుగా నిలుపుతారని ఉండేది. ప్రస్తుతం న్యాయస్ధానం గుడ్ సమారిటన్ చట్టం అమల్లో ఉందని దీని ద్వారా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం వల్ల ఎటువంటి సాక్ష్యాలు తీసుకోరని తెలిపారు. గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తీసుకువచ్చిన వారికి ప్రభుత్వం రూ. 5 వేలు పారితోషికం అందజేస్తుందని తెలిపారు.

ప్రమాదం జరిగిన వ్యక్తిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాపాయం నుండి 99 శాతం కాపాడకలుగుతామని తెలిపారు. ప్రతి డ్రైవరు బి.పి., షుగరు, కంటిచూపు, గ్యాస్టిక్ నొప్పి, వెన్నుపూస సమస్య, డ్రైవింగ్ లో ఉన్నవారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని దీనిని ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకొని మందుల ద్వారా రోగాన్ని అదుపులో ఉంచుకోవడం జరుగుతుందని అన్నారు దేశంలో లక్షా 80 వేల మంది రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోయారని దీనికి కారణం మానవ తప్పిదాలేనని తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ భధ్రతా మాసోత్సవాల ద్వారా ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ద్వారా డ్రైవర్లు వైద్య సేవలు పొందాలని కోరారు. ఈ వైద్య శిబిరం సహాయ సహకారానికి ఆయుష్ ఆసుపత్రి కి, శంకర్ నేత్రాలయం డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ భీమారావు, గేదెల ప్రసాద్, ఎస్. జగధీష్ బాబు, దుర్గా విఠల్, డా. బాలమురళీ, తదితరులు డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణకోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించారు.

ఈ సదస్సులో జంగారెడ్డిగూడెం ఆర్టిఓ మహనీయ,ఆయుష్ ఆసుపత్రి మేనేజరు జాస్తిక్ కాశీనాధ్, కార్యలయ ఎవో అనంత్, మోటార్ వెహికల్ ఇన్స్పేక్టర్లు, ఆర్టిఓలు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.