The Desk…Eluru : జాతిపిత మహాత్మ గాంధీకి ఘన నివాళులు

The Desk…Eluru : జాతిపిత మహాత్మ గాంధీకి ఘన నివాళులు

ఏలూర జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్య్రాలు అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ అని వక్తలు కొనియాడారు.

మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నందిగం సీతారాం తిలక్ (బాబి), కాట్రు బాలకృష్ణ (బాలు), వీర్ల ప్రతాప్, జిల్లా పరిషత్ విశ్రాంత సీఈఓ సిహెచ్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.